బద్దలైన వైఎస్ కంచుకోట

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. నెల్లూరు, కర్నూలు, కడప ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి  నాకాటి నారాయణ రెడ్డి విజయనం సాధించాడు. ఆయనకు 465 ఓట్లు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి 378 ఓట్లు వచ్చాయి. దీనితో నారాయణ రెడ్డి 87 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు. కర్నూలు లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 64 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు 565 ఓట్లు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డికి 501 ఓట్లు వచ్చాయి. కడప లో తెలుగుదేశం పార్టీ సంచలనం సృష్టించింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి అలియాస్ బీటెర్  రవి వై.ఎస్. వివేకానంద రెడ్డిపై 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీటెక్ రవికి 433 ఓట్లు రాగా వై.ఎస్. వివేకానంద రెడ్డికి 399 ఓట్లు వచ్చాయి.
కర్నూలు, నెల్లూరు, కడల జిల్లాల స్థానిక ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ కే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ వారందరనీ కాపాడుతోవడంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయింది. ఒకొక్కరుగా స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీని వదిలిపెట్టిపోయారు. మిగతా రెండు ప్రాంతాల్లో టీడీపీ గెలుపు ఒక ఎత్తయితే కడపలో ఆ పార్టీ విజయం మరో ఎత్తు వై.ఎస్.ఆర్ కుటుంబానికి పెట్టని కోటగా చెప్పుకునే కడప జిల్లాలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలు కావడాన్ని ఆపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ కంచుకోట బద్దలయిందని టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నా, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సోదరుడు వై.ఎస్. వివేకానంద రెడ్డిని బరిలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో తమకు ఎదురులేదని భావించిన వారి అంచనాలు పూర్తిగా తల్లకిందులయ్యాయి. పక్కా వ్యూహం ప్రకారం టీడీపీ జగన్ గట్టి షాకే ఇచ్చింది. తమకు మంచి పట్టున్న ప్రాంతాల్లోనే గట్టి ఎదురుదెబ్బలు తగలడంతో వైసీపీ నేతలు ఇప్పుడు తలలు పట్టుకుని కూర్చున్నారు.
టీడీపీ అనైతికంగా ఈ ఎన్నికల్లో గెల్చిందనే వైసీపీ ఆరోపణలు పసలేనివే. ఓటమిని ఒప్పుకోకుండా చేస్తున్న ఆరోపణల వల్ల ప్రయోజనం శూన్యం. ఓటమిపై పార్టీ నేతల్లో అంతర్మధనం మొదలైనట్టు కనిపిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ క్రమంగా తన బలాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకోక్కరుగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పార్టీకి దూరం అవుతూ వచ్చిన నేపధ్యంలో తాజా ఎన్నికల ఫలితాలు వైసీపీని మరింత నైరాశ్యంలోకి నెట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *