వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వస్థలం కడపలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో వైసీపీ ఖంగుతినింది. ఇక్కడి నుండి పోటీ చేసిన వై.ఎస్. జగన్ చిన్నాన్న వై.ఎస్ వివేకానంద రెడ్డి పై బీటెక్ రవి 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా సాగింది. ఇరు పార్టీలు సర్వశక్తులు ఒడ్డి బరిలోకి దిగాయి. కడప లో పట్టు సాధించడం కోసం ఇరు పార్టీల మధ్య పోరు తీవ్ర స్థాయిలో సాగింది. వై.ఎస్. జగన్ తన చిన్నాను పోటీకి దింపగా తెలుగుదేశం పార్టీ బీటెక్ రవిని రంగంలోకి దింపింది.
కౌంటింగ్ ప్రారంభంలో వైసీీపీ అభ్యర్థికి ఆధిక్యం వచ్చినా ఆ తరువాత క్రమంగా లీడ్ మారుతూ వచ్చింది. చివరికి టీడీపీ అభ్యర్థికి 433 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి 399 ఓట్లను సాధించగలిగాడు. కడప ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా టీడీపీ సత్తా నిరూపించుకుంది.