బ్రహ్మచారులకే జై కొడుతున్న మోడీ

పెళ్లికాని ప్రసాదులైతేనే పరిపాలన చక్కగా చేయగలరని మోడీకి స్వీయానుభవంలో తెలిసినట్టుంది. అందుకే ఉత్తర ప్రదేశ్, ఉత్తరా ఖండ్ లలో రెండు చోట్లా బ్రహ్మచారులనే ఏరికోరి ముఖ్యమంత్రులుగా నియమించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇద్దరూ బ్రహ్మచారులే. యోగి ఆదిత్యనాథ్ సన్యాసం స్వీకరించి కుటుంబానికి దూరంగా ఉండగా  రావత్ కు పెళ్లిచేసుకోలేదు.
ప్రధాని మోడి కుటుంబానికి దూరంగా ఉండగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా బ్రహ్మచారే. ఇటు పెళ్లికాని ముఖ్యమంత్రుల సంఖ్య కూడా తక్కువ ఏమీ కాదు. హర్యానా ముఖ్యమంత్రి ఎం ఎల్ ఖట్టర్, అసోం సీఎం సర్బానంద సోనోవాల్ లకు కూడా అవివాహితులే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశ్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లు ఈ జాబితాలో ఉండనే ఉన్నారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీకి వివాహం జరిగినప్పటికీ ఆమె భర్త నుండి విడాకులు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *