గ్రోవర్ పై చేయిచేసుకున్న కపిల్ శర్మ

కామెడీ నైట్స్ విత్ కపిల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కపిల్ శర్మ మరోసారి తన దుండుకు చర్యల ద్వారా వార్తల్లోకి ఎక్కాడు. తన సహనటుడు సునీల్ గ్రోవర్ పై కపిల్ చేయిచేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీలలో ప్రదర్శనలు ఇచ్చి భారత్ కు తిరిగి వస్తున్న క్రమంలో విమానంలో కపిల్ శర్మ సహనటుడు సునీల్ గ్రోవర్ పై చేయిచేసుకున్నట్టు తెలిసింది. ఆ సమయంలో కపిల్ మధ్యం మత్తులో ఉన్నాడని, తన సీటు దగ్గరి నుండి లేచి గ్రోవర్ సీటు వద్దకు వచ్చిన కపిల్ శర్మ బండబూతులు గ్రోవర్ పై చేయిచేసుకున్నట్టు సమాచారం. కపిల్ ఆవేశంతో కొట్టినా, తిట్టిన గ్రోవర్ మౌనంగా ఉండిపోయాడని తిరిగి ఏమీ అనలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
గ్రోవర్ కపిల్ తో పాటుగా కామెడీ షోలో పాల్గొంటారు. కపిల్ తో కలిసి పనిచేసిన గ్రోవర్ మధ్యలో కొన్ని రోజులు సొంతంగా కామెడీ షోలు నిర్వహించాడు. అయితే అవి అంతగా హిట్ కాకపోవడంతో తిరిగి కపిల్ వద్దకు వచ్చిన గ్రోవర్ కామెడీ షోలలో పాల్గొంటున్నాడు. కపిల్-గ్రోవర్ ల మధ్య వివాదానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు తమకు అందలేదని ఎయిర్ ఇండియా వర్గాలు చెప్తున్నాయి.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *