ప్రభుత్వానిది నిరంకుశత్వం:కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆరోపించారు. ఆదివారం కర్మన్ ఘాట్ లో జరిగిన జేఏసీ సమావేసంలో కోదండరాం మాట్లాడారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణిపై ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అణచివేత విధానాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. విమర్శలను తట్టుకోలేని ప్రభుత్వం ప్రజల స్వాతంత్ర్యాన్ని హరిస్తోందని ఆయన ఆరోపించారు. తమకు జరిగిన నష్టాన్ని చెప్పుకునే కనీస హక్కు ప్రజలకు ఉందని తమకు వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా సహించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఇందులో భాగంగానే ధర్నా చౌక్ ను నగర శివార్లకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని కోదండరాం విరుచుకుపడ్డారు. విద్యారంగ సమస్సలపై జేఏసీ ఉధ్యమిస్తుందని చెప్పారు. ప్రైవేటు విద్యాలయాల దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించి ప్రజలను ఆదుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను పటిష్టపర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇస్తున్న ఆరోగ్య కార్డుల వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని కోదండరాం అన్నారు. ఏ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్య కార్డులు ఉపయోగపడడంలేదన్నారు. జర్నలిస్టులకు కూడా వెంటనే ఆరోగ్య కార్డులు, అక్రిటేషన్లు ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *