ప్రముఖ గాయకుడు ఎస్పీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ లీగల్ నోటీసులు పంపించారు. ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పలు దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఈ కచేరీల్లో తాను సంగీత దర్శకత్వం వహించిన పాటలు ఎక్కువగా పాడుతున్నారంటూ దాన్ని తక్షణం ఆపాలని ఇళయరాజ బాలుకు నోటీసులు పంపారు. ఇళయరాజాకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు పంపడం విశేషం. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో బాలు అనేక పాటలు పాడారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇళయరాజా ఒక్క రూపాయి బాకీ ఉన్నా సంగీతాన్ని సమకూర్చడనే పేరుంది. దీనితో పాటుగా తాను సమకూర్చిన బాణీలను మార్కెట్ చేసుకోవడంతో పాటుగా ప్రైవేటు సంగీత కచేరీల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ వాడుకున్నా వారి వద్ద నుండి ముక్కుపిండి రాయల్టీ వసూలు చేసే ఇళయరాజా ఇప్పుడు ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు పంపడం పై సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.