యూపీ సీఎంగా యోగి అదిత్యనాథ్ ప్రమాణం

ఉత్తర్ ప్రదేశ్ 21 ముఖ్యమంత్రిగా బీజేపీ అతివాద నేత, ఘోరక్ పూర్ ఎంపీ యోగి అదిత్యనాథ్ ప్రమాస్వీకారం చేశారు. 44 సంవత్సరాల యోగి తో పాటుగా ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్  శర్మ, 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. . వీరిలో 22మందికి కేబినెట్‌ మంత్రులు కాగా 9మందికి స్వతంత్ర హోదా కల్పించగా  12 మందికి సహాయ మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేశారు.  ముఖ్యమంత్రితో పాటుగా ఇరువురు ఉప ముఖ్యమంత్రులు కూడా పార్లమెంటు సభ్యులు కావడం విశేషం. యూపీ రాజధాన్ని లక్నో లోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలు హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లు హాజరయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ లో చారిత్రాత్మక విజయం తరువాత యూపీ సీఎం గా ఎవరిని ఎంపికచేస్తారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ తరువాత బీజేపీ అధిష్టానం యోగి అదిత్యనాథ్ ను ఎంపికచేయడం ద్వారా సంచలనం సృష్టించింది. వివాదాస్పద నేత గా ముద్రపడ్డ ఈయన యూపీ ముఖ్యమంత్రిగా సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. సమర్థుడిగా పేరుపొందిన ఈ యువ సీఎం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.  కుల రాజకీయాలు, వెనుకబాటు తనంతో విసిగిపోయిన యూపీ ప్రజలు బీజేపీకి అఖండ విజయాన్ని అందచేశారు. ప్రస్తుతం ఆ పార్టీపై ప్రజలు పెట్టుకున్న ఆశలను తీర్చే సత్తా ఈ యూవ నేతకు ఉందని బీజేపీ భావిస్తోంది. ఆయనకు తోడుగా ఉద్దరు ఉప ముఖ్యమంత్రులను ఇవ్వడం ద్వారా యోగిపై భారాన్ని కొంతవరకు తగ్గించడంతో పాటుగా అన్ని వర్గాలుకు సమన్యాయం చేసే ప్రయత్నం చేసింది.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *