ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 44 సంవత్సరాల యోగి గోరఖ్‌పూర్ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా ఆయనే. యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, రాజ్‌నాథ్‌సింగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్ మౌర్య పేర్లు పేర్లు ప్రముఖంగా విన్పించినప్పటికీ.. అనూహ్య మలుపుల మధ్య చివరకు యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ అధిష్టానం ఎంపికచేసింది. అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఎవరు ఉంటారనేదానిపై బీజేపీ అధిష్టానం భారీ కసరత్తును చేసిన తరువాత యోగి అదిత్యనాథ్ ను ఎంపికచేసింది.
ఆర్ఎస్ఎస్ కు నమ్మకస్తుల్లో ఒకరుగా యోగి ఆదిత్యనాథ్ కు పేరుంది. ముఖ్యమంత్రిగా ఆయన పేరును ప్రకటించగానే ఆయన మద్దతు దారులు యోగి ఆదిత్యనాథ్ కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. యోగి…యోగి అనే నినాదాలతో ఆ ప్రాంతం మారు మోగిపోయింది. బీజేపీ అతివాద నేతల్లో ఒకరుగా పేరన్న ఈయన 12వ లోక్ సభకు ఎన్నికయినపుడు ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయసులోనే లోక్ సభకు ఎన్నికైన ఆయన ఘర్ వాపసీ కార్యక్రమాలతో పేరు సంపాదించుకున్నాడు. హింధూ మతం నుండి మారిపోయిన వారిని తిరిగి హింధు మతంలోకి తీసుకుని రావడం ద్వారా ఈ పేరు మారుమ్రోగిపోయింది. ఘోరక్ నాథ్ దేవాలయానికి ఈయన పీఠాధీశ్వరుడిగా వ్యవహరిస్తున్నారు.