ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కన్నా 91 పరుగులు వెనకబడి ఉన్న భారత్ నాలుగో రోజు మరిన్ని పరుగులు సాధించడం ద్వారా ఆసిస్ పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై కన్నేసింది. ఒక వికెట్ కోల్పోయి 120 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ లంచ్ సమయం వరకు మంచి ఆటతీరుతో స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. అయితే లంచ్ తరువాత ఆసిస్ బౌలర్లు భారత్ పై ఒత్తిడి తీసుకుని రావడంలో సఫలం అయ్యారు. కీలక వికెట్లను చేజార్జుకున్న భారత్ ఆట ముగిసే సమయానికి 360 పరుగులు చేయగలిగింది. ఛతేశ్వర్ పుజారా కీలకమైన 130 పరుగులు చేశాడు. కెరీర్ లో 11వ సెంచరీని పూర్తిచేసిన పుజారా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ మురళీ విజయ్ 82 పరుగులు చేశాడు. ఆసిస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, హేజిల్ వుడ్, స్టీవ్ ఒకిఫై ఒక్కో వికెట్ తీశారు.
చేతిగాయంతో ఫీల్డింగ్ కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చినప్పటికీ నిలదొక్కుకో లేకపోయాడు. 23 బంతులు ఆడిన విరాట్ 6 పరుగులు మాత్రమే చేశాడు. కమిన్స్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.