డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి తీరతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బడ్జెట్ పై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో మాట్లాడిన కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసితీరతామన్నారు. రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను ఈ సంవత్సం చివరికల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లనిర్మాణం పూర్తికాకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్లు , గ్రామీణ ప్రాంతాల్లో మరో లక్షఇళ్లను పూర్తిచేస్తామని కేసీఅర్ తెలిపారు. ప్రస్తుతం 30వేల ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కుల వృత్తుల వారు సంబురాలు చేసుకుంటున్నారని అన్నారు. అభివృద్దిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. విపక్షాలు అవగానా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని దీంట్లో తమ ప్రభుత్వం తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు.