ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యాంపు రాజకీయాలు, బుజ్జగింపులు, బెదిరింపులు, అలకల పర్వాలతో మొత్తం మీద ఎన్నికలు సజావుగానే పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 1083 ఓట్లకు గాను 1076 ఓట్లు పోలవ్వగా కడపలో 841 ఓట్లకు గాను 838 , నెల్లూరులో 852 ఓట్లు ఉండగా 849 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 20న వెలువడనున్నాయి.