పంజాబ్ సీఎంగా అమరీందర్ ప్రమాణం

     పంజాబ్ ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం తరువాత అమరీందర్ రెండ దఫా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, మన్ ప్రీత్ బాదల్, బ్రాం మోహింద్ర, చరణ్ జిత్, రాణా గుర్జీత్, సంధు సింగ్, త్రైపట్ బిజ్వాలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా అరుణ్ చౌదరి, రజియా సుల్తానాలు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ముందుగా ప్రచారం జరిగినట్టుగా నవజ్యోత్ సింగ్ సిధ్దు కు ఉప ముఖ్యమంత్రి పదవి ఏదీ లభించలేదు. ఆయన కేవలం క్యాబినెట్ మంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *