బాహుబలి-2 (‘బాహుబలి: ది కన్క్లూజన్’) ట్రైలర్ విడుదల అయింది. బాహుబలి చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేశారు. హీరో ప్రభాస్, రాణా,దర్శకుడు రాజమౌళీ తో పాటుగా ప్రముఖ దర్శకుడు కే.రాఘవేందర్ రావు ఇతర ప్రముఖులు ఈ టీజర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో పాటుగా తాను కూడా ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆశక్తిగా చూస్తున్నట్టు హీరో ప్రభాస్ తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని రాణా దగ్గుపాటి అన్నారు. సెకండ్ హాఫ్ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని దర్శకుడు రాజమౌళి తెలిపారు. ‘అమరేంద్ర బాహుబలి అను నేను. అశేషమైన మాహిష్మతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా.. ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని, రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ ట్రైలర్ ప్రారంభం అయింది. ముందు నుండి చెప్తున్నట్టుగానే అనుష్కర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రభాస్-రాణాల యుద్ధ సన్నివేశాలతో పాటుగా కట్టప్ప పక్కనుండగా తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ లతో పాటుగా గ్రాఫిక్స్ లతో ట్రైలర్ ఆకట్టుకుంది.