రెండు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ:పవన్ కళ్యాణ్

జూన్ నుండి జనసేన పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన  ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేనను ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. తాను అనంతపురం నుండి పోటీ చేస్తానని చెప్పారు. తన సోదరుడు చిరంజీవి జనసేన లోకి వచ్చే అవకాశం లేదన్నారు. తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు వెబ్ సైట్ ను ప్రారంభించామన్నారు. తమ పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. యువత బలం తమకు పుష్కలంగా ఉందన్నారు. తమ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రస్తుతానికి తాము ఎవరితోను పొత్తు పెట్టుకోలేదని పార్టీ నిర్మాణం పూర్తయ్యాక పొత్తులపై దృష్టి పెడతామన్నారు. ప్రస్తుతం తాను ఎన్డీఏ లో లేనని స్పష్టం చేశార.  ప్రజల్లోకి వెళ్లేందుకు తాము 32 అంశాలను గుర్తించినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *