జయసుధ భర్త అనుమానాస్పద మృతి

ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. 58 సంవత్సరాల నితిన్ కపూర్ ముంబైలోని తన కార్యాలయంలో కన్నుమూశారు.ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అనుమాన్సపద మృతిగా కేసును నమోదు చేశారు. భర్త మరణవార్త తెలిసిన వెంటనే జయసుధ హైదరాతబాద్ నుండి హుటాహుటిన ముంబైకు బయలు దేరి వెళ్లారు. జయసుధ-నితిన్ కపూర్ దంపతులకు  ఇద్దరు కుమారులు నిహార్, శ్రేయాన్ లు ఉన్నారు. అందులో శ్రేయాన్ బస్తీ అనే సినిమాలా హీరోగా నటించారు. నితిక్ కపూర్ జేఎస్కే కంబైన్స్‌ బ్యానర్‌పై కాంచనసీత, కలికాలం, హ్యాండ్సప్‌, మేరాపతి సిర్ఫ్‌ మేరా చిత్రాలను నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్రకు నితన్ వరుసకు సోదరుడు. నితిన్ కపూర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.నితిన్ దాదాపు ఏడాదిన్నర నుంచి డిప్రెషన్‌లో ఉన్నారని, కోకిలాబెన్ ఆసుపత్రిలో సైక్రియాటిక్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *