3గంటలు,5వేల ఖాతాదారులు 370కిలోల బంగారం

పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న ఐటి అధికారులకు విస్తుగొలిపే వాస్తవాలు తెలుస్తున్నాయి. బంగారం అమ్మకం ద్వారా అంది సొమ్మంటూ నగరంలోనే పేరు గాంచిన ముసద్దీలాల్ జ్యువెలర్స్,వైష్ణవి జువెలర్స్,ముసద్దీలాల్ జెమ్స్ పేరుతో రద్దయిన పాత నోట్లు 97 కోట్ల మేర జమ అయ్యాయి. ఈ లావాదేవీలపై  అనుమానం వచ్చి విచారణ జరిపితే ఈ మూడు సంస్థలు ఒకరికి చెందినవిగా గుర్తించారు. అంతే కాకుండా కేవలం మూడు గంటల వ్యవధిలో ఐదువేల మందికి పైగా ఖాతాదారులకు 370 కిలోల బంగారాన్నిఅమ్మినట్టు రసీదులు తయారు చేశారు. రెండు లక్షలకు పై చిలుకు అయితే పాన్ కార్డు వివరాలు చూపించాల్సి వస్తుందని అన్నీ రెండు లక్షల లోపు క్రయ విక్రయాలు గానే నమోదు చేశారు. దీనిపై అనుమానం వచ్చిన ఆదాపుపన్ను శాఖ అధికారులు విచారణ చేయాల్సిందిగా సీసీఎస్ పోలీసులను కోరారు.
సాధారణ పనిదినాల్లో రోజుకు వంద మందికి లోపు కొనుగోలుదారులు వస్తారు. పండుగలు, శుభదినాల్లో ఈ సంఖ్య 150 లోపుగా ఉంటుంది. అట్లాంటిది మూడు గంటల్లో ఏకంగా 5వేల మంది ఖాతాదారులు వచ్చినట్టు లెక్కల్లో చూపడంతో ఖంగుతినడం ఐటి అధికారుల వంతయింది. ఈ సంస్థల యజమాని నవీన్ గుప్త ఆదేశాల ప్రకారమే సిబ్బంది నకిలీ రసీదులను సృష్టించారని చెప్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఐటి అధికారులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *