అప్పుంటే తప్పేంటీ:కేటీఆర్

అప్పులు లేకుండా రాష్ట్ర అభివృద్ది ఏ విధంగా సాధ్యమవుతుందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తరువాత అప్పుల తెలంగాణ అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని పోవాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అప్పులున్నాయని చెప్పారు. అప్పులు ఉన్నంత మాత్రనా రాష్ట్రం దివాలా తీసిందని కాదనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాలన్నారు. శ్రీలంక దేశం కన్నా తెలంగాణ జీడీపీ ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు.
అప్పులు కట్టగలిగే పరిస్థితి ఉన్నంత వరకు ఎన్ని అప్పులు ఉన్నా ఏమీ కాదనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము చెపిన అప్పులకు ప్రతీ పైసాకు లెక్లు చెప్తామని కేటీఆర్ అన్నారు. తమని సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకునే విధంగా బడ్జెట్ అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. తాను చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదన్నారు. బడ్జెట్ లో తప్పుపట్టాల్సిన అంశాలు ఏవీ కనిపించకపోవడంతో అప్పులు అంటూ కాంగ్రెస్ నేతలు కొత్త పల్లవి అందుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *