చంద్రబాబు వల్లే భూమాకు గుండెపోటు:జగన్

భూమా నాగిరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ లో ఉండగా భూమా నాగిరెడ్డిని చాలా గౌరవంగా చూసుకున్నామని అయితే తమ పార్టీ నుండి టీడీపీ లోకి వచ్చినప్పటి నుండి ఆయన చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని జగన్ అన్నారు. అవమానల కారణంగానే భూమా నాగిరెడ్డి మానసిక వేదనకు గురై గుండెపోటుతో మరణించారని ఆరోపించార. చంద్రబాబు నాయుడితో మాట్లాడిన తరువాతి నుండి భూమా మానసిక వేదన అనుభవించారని దానితోనే ఆయన గుండె ఆగి చనిపోయారని అన్నారు. చంద్రబాబు నాయుడి శవ రాజకీయ కారణంగానే తమ పార్టీ అసెంబ్లీలో తమ పార్టీ సంతాప తీర్మానం జరిగిన చర్చలో పాల్గొన లేదని జగన్ వివరించారు. భూమా నాగిరెడ్డి చనిపోయినట్టు సమచారం అందగానే తాను అఖిల ప్రియను ఫోన్ లో పరామర్శించినట్టు చెప్పారు.
తండ్రి అంత్యక్రియలు జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే అఖిల ప్రియను అసెంబ్లీకి పిలిపించిన చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారని జగన్ తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల లబ్దికోసం చంద్రబాబు ఏదైనా చేస్తారనేది మరోసారి తెలిసిందన్నారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని జగన్ వెల్లడించారు. వాస్తవానికి నంద్యాల స్థానం తమ పార్టీదేనని చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి భూమాను తమ పార్టీలోకి తిప్పుకున్నారని అన్నారు. పార్టీలో చేరక ముందు భూమాకు ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు వాటిని నిలబెట్టుకోలేదని పైగా ఆయన్నుఅవమానాలకు గురిచేశారని జగన్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *