కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ బీజేపీలో చేరనున్నారు. 1999 నుండి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణ కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రివర్గంలోనూ పనిచేశారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన కృష్ణ కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జనవరిలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కృష్ణ బీజేపీలో చేరబోతున్నట్టు కర్ణాటక బీజేపీ ఆధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. ఢిల్లీలో జరిగే పార్టీ కార్యక్రమంలో కృష్ణ బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు. దీనిపై ఎస్.ఎం.కృష్ణ ఎటువంటి వ్యాఖ్యాలు చేయకపోవడంతో బీజేపీలో ఎస్.ఎం.కృష్ణ చేరడం ఖాయం అయిపోయినట్టుగానే భావిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ పదవితో పాటుగా పలు కీలక బాధ్యతలు నిర్వహించిన కృష్ణ కాంగ్రెస్ పార్టీ మేధావి వర్గంలో ప్రముఖ నేతగా చెప్పుకుంటారు.