మణిపూర్ పోరాట యోధురాలు ఇరోమ్ షర్మిలకు ఈ ఎన్నికల్లో కేవలం 90 ఓట్లు రావడం పై సమాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆమె 16 సంవత్సరాల పాటు చేసిన పోరాట ఫలితం ఇదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా ఉందా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేప్ కేసును ఎదుర్కొంటున్న వ్యక్తికి 50వేలకు పైగా ఓట్లు రాగా షర్మిలకు కేవలం 90 ఓట్లు మాత్రమే రావడం విస్మయం కలిగిస్తోందంటూ పలువరు వ్యాఖ్యానిస్తున్నారు. మణిపూర్ లో సాయుధ బలగాల చట్టానికి వ్యతిరేకంగా అలుపెరగని పేరాటం చేసిన షర్మిల మణిపూర్ లో ఉక్కు మహిళగా పేర తెచ్చుకున్నారు. 16 సంవత్సరాల పాటు నిరాఘాటంగా పోరటం చేసిన ఆమె ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బరిలో నిల్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లు కేవలం 90 మాత్రమే కావడం అందరనీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమెకు వచ్చిన ఓట్ల కన్నా నోటా కు వచ్చిన ఓట్లు ఎక్కువ కావడం విశేషం. తాను ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన వెనకడుగు వేసేది లేదని షర్మిల ప్రకటించింది. తనకు ఓటు వేసిన వారికి షర్మిల కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల్లోనే ఉంటానని ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని షర్మిల అంటోంది.