డిపాజిట్లు దక్కించుకోలేని కమ్యూనిస్టులు

గతమెంతో ఘనం అయిన కమ్యూనిస్టు పార్టీల భవితవ్యం అగమ్యగోచరంగా తయారయింది. జాతీయ పార్టీలుగా ఒక వెలుగు వెలిగిన సీపీఐ, సీపీఎం లు నేడు అస్థిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా,ఉత్తరాఖండ్,గోవా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి దారుణంగా తయారయింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 690 అసెంబ్లీ సీట్లు ఉండగా వాటిలో 107 స్థానాలకు పోటీ చేసిన కమ్యూనిస్టులు అన్ని స్థానాల్లోనూ గెలవడం మాట అటుంచి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే స్థితిలో లేకపోవడం దారుణం. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ కమ్యూనిస్టులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.
పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు కొద్దో గొప్పో పట్టుండేది. కాల క్రమేణే దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే కమ్యూనిస్టులు ఇక్కడ కూడా పట్టును కోల్పోయారు. ప్రాంతీయ  పార్టీల హవా పెరగడంతో కమ్యూనిస్టుల ఉనికి ప్రశ్నర్థకంగా మారింది. పశ్చిమ బెంగాలు, త్రిపుర, కేరళ రాష్ట్రాలకే ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు పరిమితం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో  తిరుగులేని అధికారాన్ని చలాయించిన కమ్యూనిస్టులు ఇప్పుడు అక్కడ కూడా దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాలంతో పాటు తమని తాము మార్చుకోకపోవడం, పిడివాదాలు వెరసి కమ్యూనిస్టులను ప్రజలకు దూరం చేశాయి. కేవలం ఉధ్యమాలకు మాత్రమే పరిమితం అయిపోయిన కమ్యూనిస్టులు ప్రస్తుతం దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *