నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఆళ్లగడ్డలోని శోభాఘాట్ జరిగాయి. ప్రభుత్వ లాంచనాలతో జరిగిన అంత్యక్రియలకు ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడితో పాటుగా ఆయన మంత్రి వర్గ సహచరులు, వివిధ పార్టీల నేతలు, అనుచరులు, అభిమానులు హాజరయ్యారు. భూమా నాగిరెడ్డి నివాసం నుండి శోభా ఘాట్ వరకు నిర్వహించిన అంతిమయాత్రలో భూమా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం తీవ్ర గుండెనొప్పితో హఠాత్తుగా మృతిచెందిన భూమా నాగిరెడ్డికి కడసారి విడ్కోలు పలకడానికి జిల్లా నలుమూలల నుండి ఆయన అభిమానులు హాజరయ్యారు. తల్లిని పోగుట్టుకున్న కొద్ది కాలానికే తండ్రిని కూడా దూరం చేసుకున్న భూమా పిల్లలు కన్నీటి పర్యంతం అయ్యారు.