తెలంగాణకు 1.40లక్షల కోట్ల అప్పులు

     తెలంగాణ రాష్ట్రానికి  1.40 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం రాష్టానికి 1,14,813 కోట్ల రూపాయల అప్పు ఉండగా రానున్న ఆర్థిక సంవత్సరంలో 26,400 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోనున్నారు. తద్వరా రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,40,523 కోట్ల రూపాయలకు చేరుకోనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 18.51 శాతంగా ఉన్నాయి. తలసరి అప్పు 40,149 కోట్లుగా ఉంది. గత ఏదాడి అమ్మకం పన్ను ద్వారా రావాల్సిన రాబడి కాలేదు. 42,074 కోట్ల అమ్మకం పన్నును లక్ష్యంగా పెట్టుకోగా 37,439 కోట్లు వసూలైంది. రిజిస్టేషన్ల ఆదాయం కూడా తగ్గింది 4291 కోట్ల లక్ష్యం పెట్టుకోగా 4041 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి  5083 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రుణాలు 1000 కోట్లు కాగా 36,237 కోట్ల రూపాయలను  రాష్ట్ర ప్రభుత్వం ఇతర రూపాల్లో సమకూర్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *