తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బ్రాహ్మణులకు 100 కోట్ల రూపాయలు కేటాయించడంపై బ్రాహ్మణ సంఘం నేతలు తులసి శ్రీనివాస్, వక్కలంక శ్రీనివాస్, బి. నాగరాజులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల నిధినికేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో అనేక మంది బ్రాహ్మణులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారిని ఆదుకునేందుకు ఈ కేటాయింపులు ఎంతగానో ఉపయోగపడతాయని వారన్నారు. నిధులను సక్రమంగా ఉపయోగించుకోవాలని బ్రాహ్మణులకు వారు సూచించార.