అఖిల ప్రియకు మంత్రివర్గంలో చోటు…?

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమారై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. అతి త్వరలో ఏపీలో మంత్రివర్గ విస్థరణ ఉన్న నేపధ్యంలో అప్పుడు అఖిల ప్రియకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని అంటున్నారు. ఆదివారం గుండెపోటుతో మరణించిన భూమా నాగిరెడ్డికి మంత్రి వర్గంలో స్థానం కల్పించడం ఖాయం అనుకున్న క్రమంలో ఆయన మరణించడంతోఆయన స్థానంలో కుమారై అఖిల ప్రియను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి కర్నూలు నుండి బలమైన నేతగా ఉన్న భూమా నాగిరెడ్డి మృతి ఆ పార్టీ నేతలను కలచివేస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెల్చిన భూమా నాగిరెడ్డి ఆయన కుమారై అఖిల ప్రియలు ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరేముందే మంత్రివర్గంలో  తప్పకుండా స్థానం కల్పిస్తామని టీడీపీ అధినేత వద్ద గట్టి మాట తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వర్గ, ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన కర్నూలులో భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చకోవడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. భూమా వర్గానికి, శిల్పా మోహన్ రెడ్డి  వర్గానికి మధ్య తీవ్ర వైరుధ్యాలు ఉన్నప్పటికీ రెండు వర్గాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. ఇరు వర్గాలు తమ విభేదాలను కొంత వరకు పక్కనపెట్టి పలిసి పనిచేయడం ప్రారంభించారు. భూమాకు మంత్రివర్గంలో చోటు కల్పిండాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన శిల్పా మోహన్  రెడ్డి వర్గం ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల ప్రియ మంత్రిపదవికి అడ్డుచెప్పక పోవచ్చు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *