యూపీలో బీజేపీ ప్రభంజనం

 

కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ లో కమలపార్టీ సత్తా చాటింది. 403 సీట్లకు గాను 312 సీట్లలో విజయం సాధిచండం ద్వారా బీజేపీ తిరుగులోని ఆధిక్యాన్ని ప్రదర్శించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తుకు చేరిపోయింది. మూడింట రెండు వంతుల మెజార్టీని సాధించడం ద్వారా బీజేపీ యూపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. కుటుంబ కలహాలు, పార్టీలో విభేదాలు, ఐదు సంవత్సరాల పాలనలో కానరాని అభివృద్ది కలిసి సమాజ్ వాదీ పార్టీని నిట్టనిలువనా ముంచాయి. కేవలం 47 స్థానాలకు ఆ పార్టీ పరిమితం అయింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న పొత్త ఎస్పీకి కలిసి రాలేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయైరయింది. అధికార పార్టీతో పొత్తు పెట్టుకుని లభపడదామనుకున్న ఆ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. యూపీలో ఆ పార్టీ కేవలం 7 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

UP- (403)
BJP 312
SP/CONG 54
BSP 19
OTH 18