కోన్ బనేగా యూపీ సీఎం

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీలో ఇప్పుడు యూపీ పీఠంపై కొలువుదీరేది ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలిపోనుంది. దేశంలోనే అత్యంత జనాభా కల్గిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది సస్పెన్స్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠానికి పోటీ కూడా ఎక్కువగానే ఉంది. ఉత్తర్ ప్రదేశ్ సీఎం పదవికి పోటీపడుతున్న వారు..
మనోజ్ సిన్హా..

57 సంవత్సరాల మనోజ్ సిన్హా నరేంద్ర మోడీ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా పనిచేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీ పూర్ లోక్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అగ్రవర్ణ నాయకుడు మోడీకి సన్నిహితుడుగా పేరుపొందాడు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం బాధ్యతలను కూడా ఈయనే చూస్తున్నారు.
కేశవ్ ప్రసాద్ మౌర్య

ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ నేతగా ఉన్నా మౌర్య వెనుకబడిన వర్గాలకు చెందిన నేతగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి బీసీల మద్దతు సంపాదించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. యాదవేతర బీసీ కులాలను ఒక్కతాటిపైకి తీసుకుని వచ్చి బీజేపీకి మద్దతు కూడగట్టడంలో సఫలం అయ్యారు. సంఘ్ పరివార్ కు చెందిన మౌర్య విశ్వహింధూ పరిషత్ నేతగా రామమందిర ఉథ్యమంగా చిరుగ్గా పాల్గొన్నారు. వీహెచ్ పీ నేతల మద్దతు ఈయనకు పుష్కలంగా ఉంది.
రాజ్ నాథ్ సింగ్

కేంద్ర మంత్రివర్గంలో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ 65 సంవత్సరాల ఠాకూర్ నేత ఆర్ఎస్ఎస్ కు నమ్మినబంటు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అత్యంత సీనియర్ నేత అయిన రాజ్ నాథ్ గతంలో యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే రాజ్ నాథ్ సేవలు కేంద్రంలో వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి భావించిన పక్షంలో ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం లేదు.
మహేష్ శర్మ

గౌతం బుద్ధ నగర్ నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన కేంద్ర మంత్రి వర్గంలో టూరిజం శాఖను నిర్వహిస్తున్న ఈయన గతంలో యూపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఉత్తర్ ప్రదేశ్ లో పేరుమోసిన వైద్యుడైన శర్మ ఆర్ఎస్ఎస్ తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
దినేష్ శర్మ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు అత్యంత సన్నిహిడుగా పేరుగాంచిన దినేష్ శర్మ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *