ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన అధిఖ్యం దిశగా దూసుకు పోతోంది. ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుందంటూ వచ్చిన ఊహాగానాలను పటాపంచలు చేస్తూ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తూ బీజేపీ ఆధిక్యం సుస్పస్టం అయింది. సమాజ్ వాదీ, కాంగ్రెస్ కూటమి బీజేపీకి దరిదాపుల్లో కూడా లేదు. తాజాగా సమాచారం ప్రకారం బీజేపీ 265 స్థానాల్లో ఆధిఖ్యంలో ఉండగా సమాజ్ వాదీ, కాంగ్రెస్ ల కూటమి 81 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఎస్పీ 25 స్థానాలల్లో ఆధిక్యం మూడో స్థానంలో ఉంది.