బ్యాంకులతో చర్చలకు సిద్ధంమంటున్న మాల్యా

బ్యాంకులకు వేల కోట్లరూపాయలు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాను బ్యాంకులతో చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు. బ్యాంకుల రుణాలకు సంబంధించి వన్ టైం సెటిల్ మెంట్ కు తాను సిద్ధంగా ఉన్నానంటూ మాల్య తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా లండన్ కు పారిపోయిన మాల్యా బ్యాంకులతో వన్ టైం సెటిల్ మెంట్ చేసుకుంటానంటున్నాడు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వన్ టైం సెటిల్ మెంట్ కు అవకాశం ఉందని చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని మాల్యా అంటున్నారు. తాను కూడా అవకాశం ఇస్తే బ్యాంకులతో వన్ టైం సెటిల్ మెంట్ కు సిద్ధమంటున్నాడు. సుప్రీం కోర్టులో తాను వన్ టైం సెటిల్ మెంట్ కు సిద్ధం అంటూ చెప్పినా బ్యాంకులు అందుకు ముందుకు రావడం లేదన్నారు. తన విషయంలో బ్యాంకులు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. సుప్రీంకోర్టు జోఖ్యం చేసుకుని బ్యాంకులు తనతో వన్ టైం సెటిల్ మెంట్ చేసుకునేలా ఆదేశాలు జారీచేయాలని మాల్యా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *