రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిషేధిత మోల్డోనియంను తీసుకుందున షరపోవా పై 15 నెలల నిషేధాన్ని విధించారు. ఈ నిషేధం తరువాత తిరిగి రంగ ప్రవేశం చేసిన షరపోవాకు ప్రెంచ్ ఓపెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. 15 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న షరపోవాకు అంతర్జాతీయ టెన్నీస్ ర్యాంకింగ్ లేదు. దీనితో ప్రెంచ్ ఓపేన్ లో అన్ సీడెడ్ గా ఆమె బరిలో దిగుతోంది. వాస్తవానికి అన్ సీడెడ్ క్రీడాకారులు అర్హత పోటీలను అడిన తరువాతే టోర్నిలో అడడానికి అనుమతి ఇస్తారు. ఐదు సార్లు గ్రాండ్ శ్లామ్ విజేత అయిన షరపోవాకు టోర్నీ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడాన్ని కొంత మంది తప్పుబడుతున్నారు. ‘షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఇవ్వడమంటే తప్పు చేసిన చిన్నారికి చాక్లెట్ ఇవ్వడం వంటిది’ అని పురుషుల ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జో విల్ఫ్రెడ్ సొంగా వ్యాఖ్యానించాడు.
మరో వైపు షరపోవాలకు మద్దతు ఇస్తున్న వారు కూడా లేకపోలేదు. షరపోవాకు ఆ దేశ టెన్నిస్ చీఫ్ షామిల్ టర్పిచేవ్ మద్దతుగా నిలిచారు. మెల్డోనియం తీసుకోవడం డోపింగ్ కిందకు రాదని నిరూపితమైందన్నారు. సొంగా వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. షరపోవా ప్రపంచంలోని అత్యున్నత క్రీడాకారిణుల్లో ఒకరన్నారు. పక్కా ప్రొఫెషనల్ అయిన షరపోవా వైల్డ్ కార్డ్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు.