శాసనసభ సమావేశాలకు ఎమ్మెల్యేలు అంతా హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు గౌర్హజరు కాకుండా మొత్తం సమావేశాలకు అందరూ రావాలన్నారు. సమావేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అంతా హుందాగా వ్యవహరించాలని అన్నారు. అందరూ విధిగా సభలకు హాజరు కావాలన్నారు.