పాక్ కాల్పుల్లో భారత్ జవాను మృతి

పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పుంచ్ సెక్టార్ లో భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులకు దిగింది. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో భారత్ జవను ఒకరు మరణించారు. దీనితో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసార ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. భారత్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా పాకిస్థాన్ జవాన్లు భారీ ఎత్తున కాల్పులకు దిగారు. తేలికపాటి ఆయుధాలతో పాటుగా భారీ తుపాకులు, మోర్చార్లతో పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత్ కు చెందిన జవాను అమరుడయ్యాడు. అయితే పాక్ కాల్పులకు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. పాకిస్థాన్ కాల్పులకు దిగిన ప్రాంతంలో భారత దళాలు ప్రతి దాడులు నిర్వహిస్తున్నాయి. ఇరువైపుల నుండి భారీ ఎత్తున కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం కాల్పుల మోతతో మారు మ్రోగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా భారత్ సరిహద్దుల్లో ఉన్న జనావాసాలను ఖాళీ చేయిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *