మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రద్దయింది. ఈ పోలింగ్ ను రద్దు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 19న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ఫొటోలు తప్పుగా అచ్చవడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సీరియల్ నెంబర్ మూడులో ఉన్న మాణిక్ రెడ్డి,తొమ్మిదో నెంబర్ లో ఉన్న లక్ష్మయ్య ఫొటోలు తారుమారు అయ్యాయి. మాకిణ్ రెడ్డి పేరు పక్కన లక్ష్మయ్య ఫొటో రాగా, లక్ష్మయ్య పేరు పక్కన మాణిక్ రెడ్డి ఫొటో వచ్చింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.