వరుసగా సంచలన నిర్ణయాలను ప్రజల నడ్డి విరగ్గొడుతున్న ఆర్బీఐ తాజాగా మరో నిర్ణయంతో ప్రజల ఇబ్బందులను మరింత పెంచింది. అత్యవసర సమయాల్లో ఆదుకునే బంగారం తాకట్టుపైనా ఆంక్షలు విధించింది. బ్యాంకులు కాకుండా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బంగారంపై ఇచ్చే రుణం నగదు రూపంలో 25 వేలకు మించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇటువంటి సంస్థలు లక్ష రూపాయల వరకు నగదు చెల్లింపులు జరుపుతున్నాయి. ఇక నుండి 25వేలు దాటితే నగదు రూపంలో చెల్లింపులు జరిపే వీలు ఉండదు. చెక్కు రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఖాతాదారుల నుండి బ్యాంకులు సర్వీస్ ట్యాక్స్ పేరుతో ఖాతాదారులకు చుక్కులు చూపిస్తుంటే ఆర్బీఐ కూడా తానే తక్కువ తినలేదంటూ ప్రజల నడ్డి విరుస్తోంది.