ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి-4, కాంగ్రెస్ కు-1

EXIT
దేశరాజకీయాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలను వివిధ ఛానళ్లు సంస్థలు విడుదల చేశాయి. వీటి ప్రకారం కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ తో పాటుగా ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో బీజేపీ హవా కనిపిస్తుండగా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఎన్డీటీవీ, ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా వెల్లడించిన ఫలితాలను చూద్దాం…
ఉత్తర్ ప్రదేశ్
కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ హవా కనిపిస్తోంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలోబీజేపీ 185 స్థానాలను గెల్చుకునే అవకాశాలున్నట్టు అంచానా..సమాజ్ వాదీ, కాంగ్రెస్ ల కూటమికి 120 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. బీఎస్పీ 90 స్థానాలకు పరిమితం కాగా ఇతరులు 8 చోట్ల గెల్చే అవకాశాలున్నాయి.
పంజాబ్
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రస్తుతం అదికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్, బీజేపీ కూటమి దారుణంగా దెబ్బతినే అవకాశాలున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ 62 నుండి 71 స్థానాలు గెల్చే అవకాశాలున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో బలీయమైన శక్తిగా అవతరించనుంది ఆ పార్టీకి 42 నుండి 51 స్థానాలు రావచ్చని అంచానా, ప్రస్తుతం అధికారంలో ఉన్న అకాళీదళ్, బీజేపీ కూటమి దారుణంగా దెబ్బతింటోంది ఇక్కడ ఆ కూటమికి కేవలం 4 నుండి 7 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి, ఇతరులు అత్యధికంగా రెండు స్థానాల్లో గెల్చే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్
70 స్థానాలున్న ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోనుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ 46 నుండి 53 సీట్లను సాధించడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచానా వేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 12 నుండి 21 సీట్లను దక్కించుకోవచ్చు, బీఎస్పీ 1 నుండి రెండు స్థానాల్లో గెల్చే అకవాశం ఉండగా ఇతరులు 1 నుండి 4 స్థానాలను కైవసం చేసుకునే అవకాసం ఉంది.
మణిపూర్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ 25 నుండి 35 స్థానాలను గెల్చుకోవడం ద్వారా మొదటి సారిగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందుకునే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచానా. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ 17 నుండి 23 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరులు 9 నుండి 15 స్థానాలను కైవసం చేసుకోవచ్చు.
గోవా
గోవాలో 40 అసెంభ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ మరో సారి తన అధికారాన్ని నిల్పుకునే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచానా. ఇక్కడ అధికార బీజేపీ 15 నుండి 22 స్థానాలను గెల్చుకుని అధికారం నిలబెట్టుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 12 నుండి 18 స్థానాలను గెల్చుకోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 2 నుండి 8 చోట్ల గెల్చే అవకాశాలున్నాయి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *