రకూల్ కు తల్లిగా మాజీ హీరోయిన్

    తెలుగుతో పాటుగా మళయాళీ,తమిళ,కన్నడ చిత్రాల్లో హీరోయిన్ అనేక సినిమాలు నటించిన వాణీవిశ్వనాథ్ చాలాకాలం తరువాత  వెండి తెరపై కనిపించబోతోంది. అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తరువాత పెళ్లిచేసుకుని సినిమాలకు దూరం అయిన ఈమె తిరిగి సినిమా రంగ ప్రవేశం చేయబోతోంది. అగ్ర దర్శకుడి బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హిరోయిన్ రకుప్రీత్ సింగ్ కు తల్లిగా వాణీవిశ్వనాథ్ కనిపించబోతోంది. చాలా కాలం తరువాత చిత్రాల్లో నటిస్తున్న ఈమె తన తోటి హీరోయిన్లతో పాటుగా తల్లి పాత్రల్లో కనిపిస్తోంది. బెల్లకొండ శ్రీనివాస్ హీరో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది.
    పాత తరం హీరోయిన్లలో ఇప్పటికే చాలా మంది తల్లి పాత్రల్లో మెరిశారు. రమ్యకృష్ణ, రోజా, మీనా, నదియాలు అమ్మ పాత్రల్లో కనిపిస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు వాణీ విశ్వనాధ్ కూడా వచ్చి చేరింది. గతంలో హీరోయిన్లుగా రాణించిన వీరంతా ప్రస్తుతం తల్లుల పాత్రల్లో మెప్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *