అగ్నిప్రమాదంలో 21 మంది చిన్నారులు సజీవదహనం అయిన దారుణ ఘటన అమెరికాలో జరగింది. గ్వాటెమాలా నగరంలోని సాన్ జోస్ పిన్యూలా అనాధ అశ్రమంలో జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది చిన్నారులు సజీవ దహనం కాగా మరో 40 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొంత మంది ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అనాధలు, ఇంటినుండి పారిపోయి వచ్చిన పిల్లలలకు ఆశ్రయం కల్పించే ఈ ఆశ్రమంలో చెలరేగిన మంటల నుండి తప్పించుకునే మార్గం లేక పిల్లలు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో 800 మంది చిన్నారులు ఆశ్రమంలో ఉన్నట్టు అధికారులు వెళ్లడించారు. 500 మందికి మాత్రమే ఆశ్రయం ఇవ్వగలిగిన ఈ భవనంలో 800 మంది చిన్నారులను ఉంచినట్టు అధికారులు చెప్తున్నారు.
గుర్తు తెలియని వారు నిప్పుపెట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుందనే వార్తలు కలచివేస్తున్నాయి. పిల్లలు పడుకోవడానికి ఉపయోగించే పరుపులకు నిప్పుపెట్టడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడినట్టు తెలుస్తోంది. మంటలను అదుపుచేసే ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో బయటకు వచ్చే మార్గం లేక 21 మంది చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ అనాధ ఆశ్రమంలో నిత్యం గొడవలు మామూలే. అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారు నిత్యం కొట్టుకుంటూ ఉంటారు. వారని అదుపు చేయడం నిర్వాహకులకు తలకు మించిన భారం గా మారుతోంది. తమకంటే చిన్నపిల్లలను బలహీనంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తుంటారు. దీనితో ఇక్కడి నుండి చాలా సార్లు వేధింపులను భరించలేక పారిపోవడం మామూలే. ఈ క్రమంలోనే పరుపులకు నిప్పుపెట్టారని భావిస్తున్నారు. అగ్నికీలలకు 21 చిన్నారులు బలైన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మరో 14 మంది పిల్లలు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు.