హతమైంది ఐఎస్ ఉగ్రవాదే

మధ్యప్రదేశ్ లో రైలులో జరిగిన పేలుడు వెనుక ఐఎస్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుకుడుకు పాల్పడింది ఐఎస్ ఉగ్రవాద మూకలేనని భావిస్తున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి ఉజ్జయినికి వెళ్తున్న ప్యాసింజర్ లో జరిగిన పేలుడులో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరొక ఉగ్రవాది ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాది సైపుల్లా వద్ద ఐఎస్ జెండాలు, భారీ ఎత్తున ఆయుధాలు లభ్యం అయ్యాయి. రైల్లో పేలుడుకు పాల్పడ్డ సైఫుల్లా అక్కడి నుండి తప్పించుకుని ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో శివార్లలోని ఒక ఇంట్లో నక్కడంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఉగ్రవాదనికి ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంట్లో నక్కిన ఉగ్రవాదిని సైఫుల్లా గా గుర్తించిన పోలీసులు అతడి సోదరుడి ద్వారా లొంగిపోయేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృతుడి సోదరుడిని ఉగ్రవాది నక్కిన ఇంటివద్దకు తీసుకుని వచ్చిన పోలీసులు లోపలికి ఒక ఫోన్ ను విసిరివేశారు. దాని ద్వారా ఉగ్రవాది సోదరుడితో మాట్లాడించి లొంగిపోయేలా ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు  విఫలం అయ్యాయి. తాను లొంగిపోయేది లేదిని అంతకంటే చనిపోవడానికే ప్రధాన్యం ఇస్తానంటూ మొండిగా వ్యవహరించిన ఉగ్రవాది ఆఖరికి పోలీసుల తూటాలకు హతమయ్యాడు.
కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి ఐఎస్ ఉగ్రవాద సంస్థ శిక్షణ తీసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలను వాడడం, పేలుళ్లకు పాల్పడడంతో పాటుగా పోలీసులు చుట్టుముట్టినా మూర్ఖంగా ప్రవర్తించడం, లొంగిపోయేకంటే చనిపోవడానికే మొగ్గుచూపడం వంటి అంశాలను బట్టి చనిపోయిన ఉగ్రవాది ఐఎస్ శిక్షణలో రాటుదేలిన తీవ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనితో పాటుగా హతుడి వద్ద దొరికిన ఐఎస్ జెండాలతో హతమైంది ఐఎస్ ఉగ్రవాదిగానే పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *