జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు త్వరలో మోక్షం

జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులు త్వరలోనే మోక్షం లభించనుంది.  వివాదం తో సుప్రీంకోర్టు లో పెండింగ్ లో వున్న ఇళ్ల స్థలాల కేసు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. “సత్వర తీర్పు” కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వేసిన special mention ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. కేసు లో వాదప్రతి వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పు కోసం ఏప్రిల్ 5 వ తేదీకి వాయిదా వేశారు. 12 ఏళ్లుగా ఎటూ తెలకుండా ఉన్న కేసు ను తొందరగా పరిష్కరించాలని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తున్న వాయిదా ల మీద వాయిదాలు పడుతూవస్తుంది. అనేక మంది ముఖ్యమంత్రు లు మారినప్పటికి సరియైన డైరెక్షన్ లేక దిక్కుమొక్కులేనిది గా తయారైంది. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ న్యాయ నిపుణుల తో చర్చించి తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ని ఈ రోజు స్వయంగా సుప్రీంకోర్టు కు పంపించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని one time benefit కింద సొసైటీ ల ద్వారా ఇవ్వడానికి సిద్దం అని తెలపడంతో తుది వాదనలు, తీర్పు కోసం ఏప్రిల్ 5 కు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చొరవ ప్రశంసనీయం ….. తెలంగాణరాష్ట్రం ఏర్పడ్డాక జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కె సి ఆర్ ముందుగా ఈ కేసు ను తేల్చాలని నిర్ణయించారు. దానిలో భాగంగా కొన్ని రోజులుగా న్యానిపుణులు, రెవెన్యూ అధికారులు,ప్రెస్ అకాడమీ, జర్నలిస్ట్ సంఘాల నేతల తో వరుస సమావేశాలు నిర్బహించిన సీ ఏం చివరకు పరిష్కారమార్గాన్ని అన్వేషించారు. కోర్ట్ లో వాదనలు వినిపించడం లో విఫలం అవుతున్న విషయాన్ని గ్రహించారు. దీంతో రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సారిగా అడ్వొకేట్ జనరల్ ని స్వయంగా పంపించారు. ముఖ్యమంత్రి
తన ఓ ఎస్ డి భూపాల్ రెడ్డి, జర్నలిస్ట్ ల ప్రతినిధులు క్రాంతి, పల్లె రవి ని కూడా పంపించి తమ వాదనలు పకడ్బందీగా జరగడానికి మార్గం సుగమం చేశారు. ఈరోజు జస్టిస్ చలమేశ్వర్ గారి బెంచ్ వద్ద జరిగిన వాదనలను బట్టి కేసు ఏప్రిల్ లో ఫైనల్ కావడం కాయంగా కనిపిస్తోంది. ఇందుకు మనస్పూర్తిగా చొరవ చూపిన ముఖ్యమంత్రి కె సి ఆర్ కు పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలుపుతున్నారు.
courtesy: whats up message

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *