ప్రత్యేక కారణాల వల్లే మన్మోహన్ మౌనం

    

    భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొన్ని కారణాల వల్ల మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేత మనీశ్ తివారి అన్నారు. అయితే ఆ కొన్ని కారణాలు ఏమిటి అన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఢిల్లీలో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న తివారి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్న విషయాన్ని చెప్పడానికి మనీశ్ నిరాకరించారు. భారత ప్రధానుల్లో అందరికంటే మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అత్యంత బలహీనుడనే వాదనతో తాను ఏకీభవించనని  తివారి అన్నారు. మన్మోహన్ బలహీన ప్రధాని మాత్రం కాదని ఆయన కొన్ని  విషయాల్లో చాలా గట్టిగా వ్యవహరించారని అన్నారు. మన్మోహన్ నిజంగా బలహీన ప్రధాని అయిఉంటే ఖచ్చితంగా ఆయన పౌర అణు ఒప్పందాల జోలికి వెళ్లేవారు కాదన్నారు.
మన్మోహన్ సింగ్ తనను తాను ఒక్కువగా చేసి చూపించుకోలేదని, ప్రచార ఆర్భాటాలకు కూడా దూరంగా ఉండిపోయారని అన్నారు. ఇటువంటి వాటి వల్ల మన్మోహన్ సింగ్ ను బలహీన ప్రధానిగా చూస్తున్నారని అది ఎంత మాత్రం సరైంది కాదన్నారు. మన్మోహన్ కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తాను వ్యక్తిగతంగా పేరు సంపాదించుకోవడం కంటే పార్టీ కి తన నిర్ణయాలు ఉపయోగ పడాలని భావించేవారని దాని వల్ల మన్మోహన్ సింగ్ తన వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ విలువ ఇవ్వలేదని అన్నారు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు నిరుపమానమని అన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని హోదా చేస్తున్న వ్యాఖ్యాలు దేశ ప్రజలకు విడదీసేవిధంగా ఉన్నాయని మండిపడ్డారు. మోడీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు దేశ ప్రధాని మాట్లాడాల్సిన స్థాయిలో లేవని అన్నారు. ప్రధాన మంత్రి స్థాయికి తగినట్టుగా మాట్లాడాలని మోడీకి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *