ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొత్త భవనంలో తొలిరోజు సభ వాకౌట్లతో మొదలైంది. శాసనసభ సోమవారమే ప్రరంభమైనప్పటికీ తొలిరోజు గవర్నర్ ప్రసంగం తదితర అంశాలతో సభ ముగిసింది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే అధికర విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శాసనసభ నుండి రోజాను మరో సంవత్సరం పాటు సస్పెండ్ చేయడంతో పాటుగా కరవు, విధ్యుత్ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యులు వాగ్వాదాలకు దిగారు. అధిక విద్యుత్ బిల్లులకు నిరసగా వైసీపీ సభ నుండి వాకౌట్ చేసింది. విధ్యుత్ బిల్లులలతో ప్రజలు అల్లాడుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. విద్యుత్ బిల్లులను ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయని జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ కు అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సభ నుండి వాకౌట్ చేస్తున్నట్టు జగన్ చెప్పారు.