ఉద్యోగాలు లాక్కుంటున్నారు యూఎస్ లో విధ్వేష వీడియో

అమెరికాలో భారతీయుల పట్ల విధ్వేషపూరిత వ్యాఖ్యలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒహయో రాష్ట్రంలోని కొలంబస్‌లోని ఒక పార్కులో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్న విడియోను చూపిస్తూ ఈ ప్రదేశం మినీ భారత్ గా మారిపోయిందని  స్టీవ్‌ పుషొర్‌ అనే వ్యక్తి పెట్టిన వీడియో ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతోంది. వీడియోని పెట్టడంతో పాటుగా ఇంత మంది ఇండియన్లు ఇక్కడ ఉన్నారంటే అంతే సంఖ్యలో అమెరికన్ల ఉద్యోగాలను వారు లాక్కున్నారు అనే వ్యాఖ్యలతో కూడిన వీడియో పై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ కు చెందిన వారి కార్లను చూపిస్తూ వారు ఖరీదైన కార్లను వాడుతున్నారని, అమెరికన్ల ఉద్యోగాలు లాక్కుంటున్నారంటూ విద్వేష పూరిత వ్యాఖ్యాలతో కూడిన వీడియోను  స్టీవ్‌ పుషొర్‌ వెబ్ సైట్ లో పెట్టడంతో పాటుగా తన వాట్సాప్ ద్వారా చాలా మందికి పంపాడు. ఇప్పుడు సదరు వీడియో అమెరికాలో ప్రచారం జరుగుతోంది. పార్కులో ఇంతకు ముందు భారతీయులు క్రికెట్ ఆడేవారని ఇప్పుడు వాలీ బాల్ వాడుతున్నారంటూ చెప్పడంతో పాటుగా అమెరికాకు చెందిన వారి ఉద్యోగాలు సైతం భారతీయులు తీసేసుకుంటున్నారంటూ విద్వేషపూరితంగా చేసిన వ్యాఖ్యల పై భారతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అమెరికాలో పలు చోట్ల విద్వేషపూరిత వ్యాఖ్యాలు ఎక్కువ కావడంతో పాటుగా భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి విద్వేష పూరిత దాడిలోనే హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతిచెందిన సంగతి తెలిసింది. ఇటీవల కాలంలో భారతీయులుపై దాడులు పెరిగాయని ఇటువంటి వీడియోలు దాడులకు మరింత ఊతం ఇచ్చేవిగా ఉన్నాయని అమెరికాలో ఉంటున్న భారతీయులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *