జయలలిత మృతిపై నివేదిక

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి 19 పేజీల నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఎయిమ్స్ బృందం ఇచ్చిన ఈ నివేదికను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఆసుపత్రిలో చేరినప్పటికే జయలలిత అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఆ నివేదికలో స్పష్టం చేశారు. శ్వాసకోశ, డీ హైడ్రేషన్ సమస్యలతో జయలలిత ఆస్పత్రిలో చేరినట్టు ఆ నివేదకలో పేర్కొన్నారు. జయలలిత మరణంపై మాజీ సీఎం పన్నీరు సెల్వంతో పాటుగా జయ మేనకోడలు దీపా జయ్ కర్, విపక్షనేత స్టాలిన్, ఇతరులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేసింది. జయలలిత మృతిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆ నివేదికలో స్పష్టం చేశారు. జయలలితను కాపాడేందుకు వైద్యులు అన్నికరాలుగా ప్రయత్నాలు చేశారని దివేదికలో పేర్కొన్నారు. జయలలిత మృతికి సంబంధించి ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని ఆ నివేదక స్పష్టం చేసింది.
అనారోగ్యంతో జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన తరువాత ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ బృందం ఆమెకు చికిత్స చేసింది. అపోలో వైద్యులతో పాటుగా ఎయిమ్స్ వైద్యుల బృందం కూడా జయలలితకు చికిత్సను అందచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *