యాదగిరిగుట్ట నరసింహుడి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. సంప్రదాయ బద్దంగా స్వామివారి కళ్యాణాన్ని వేద మంత్రోచ్చారణలమధ్య జరిపించారు. వైషవాగమం ప్రకారం ఈ కళ్యాణం జరిగింది. సాధారణంగా ప్రతీ సంవత్సరం రాత్రి సమయంలో కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించేవారు అయితే ప్రస్తుతం ఆలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున బాలాయంలో కళ్యాణ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సమర్పించారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తో పాటుగా జాయింట్ కలెక్టర్, ఆలయ ఈఓ ఇతర అధికారులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.