జే.సి. ప్రభాకర్ ధర్నా-అరెస్ట్

దివాకర్ ట్రావెల్స్ అధినేత, ప్రముఖ రాజకీయ నాయకుడు జే.సీ. ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో హల్ చల్ చేశాడు. ఇటీవల కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురైన తన ట్రావెల్స్ కు చెందిన బస్సు వ్యవహారంలో తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ సాక్షి పత్రికి కార్యాలయం ఎదుట ప్రభాకర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. తన కుమారుడు అజ్మిత్ రెడ్డితో కలిసి ధర్నాకు దిగిన జే.సీ. ప్రభాకర్ రెడ్డి తన పై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. తనను ముఖ్యమంత్రి పాడుతున్నారంటూ రాస్తున్న రాతలను నిరూపించాలని జే.సీ.ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తనను కాపాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతుల మేరకే తాము బస్సులను నడుపుతున్నామని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తరువాతే బస్సులు తిరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత దురదృష్ణకరమని జే.సి. ప్రభాకర్ రెడ్డి అన్నారు. బస్సు ప్రమాదానికి గురవ్వాలని  ఎవరూ కోరుకోరరని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీని వల్ల బస్సులు ప్రమాద ఘటనలో వాస్తవాలు బయటకు రావడం లేదని కధనాన్ని ప్రచురించిన సాక్షి పత్రికి అందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికోడ్ ఉన్నందును ధర్నాలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు జే.సీ. ప్రభాకర్ రెడ్డితో పాటుగా ఆయన కుమారుడుని అరెస్టు చేశారు.