శివసేనకే ముంబై మేయర్ పదవి

ముంబాయి కార్పోరేషన్ మేయర్ పదవిని శివసేనే చేపట్టనుంది. ముంబాయి కార్పోరేషన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా శివసేన ఆవిర్భవించినప్పటికీ మేయర్ పదవిని చేపట్టేందుకు కావాల్సిన డివిజన్లను మాత్రం దక్కించుకోలేకపోయింది. దీనితో ముంబాయి కార్పోరేషన్ మేయర్ పదవిని ఎవరు చేపడతారు అనేది ఉత్కంఠగా మారింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తామే మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని స్పష్టం చేసిన శివసేన దానికి అనుగుణంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. అటు బీజేపీ కూడా తొలుత మేయర్ పీఠంపై కన్నేసినా ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. మేయర్ పీఠాన్ని శివసేనకే ఒదిపెట్టాలని భావించిన ఆ పార్టీ తాము మేయర్ పదవికోసం పోటీపడడం లేదని ప్రకటించడంతో ఇక శివసేనకే మేయర్ పదవి ఖాయం అయిపోయింది. గత 25 సంవత్సరాలుగా ముంబాయి మేయర్ పదవిని సొంతంచేసుకుంటూ వచ్చిన శివసేన తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. మహారాష్ట్రలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ లు ఈ దఫ ఎవరికి వారుగానే పోటీ చేశాయి . అనూహ్యంగా బీజేపీ మహారాష్ట్ర కార్పోరేషన్ లో భారీగా సీట్లను గెల్చుకుని తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంది. శివసేనకు 84 స్థానాలు రాగా 82 స్థానాలతో బీజేపీ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది. అయితే కాస్త బెట్టువీడిన బీజేపీ మేయర్ పీఠన్ని శివసేనకే వదిలిపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *