భారత బ్యాట్స్ మెన్ మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. బెంగళూరులో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్ లో కూడా భారత్ ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలం అయ్యారు. మొదటి రోజు భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. లోకేశ్ రాహుల్ మినహా మిలిగిన ఆటగాళ్లు అందరూ విఫలం అయ్యారు. భారత్ లైనప్ పేపమేడలా కూలిపోయింది. రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 90 పరుగులు చేశాడు. సెంచరీ దిశగా వెళ్తున్న రాహుల్ 90 పరుగుల కు అవుటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ లియాన్ భారత్ పతనాన్ని శాసించాడు. తన స్పిన్ మాయాజాలంతో భారత్ వెన్ను విరిచాడు. మొత్తం 8 వికెట్లు తీసుకున్న లియాన్ కొత్త రికార్డును నెలకొల్పాడు. భారత్ ఆటగాళ్లను బెంబేలెత్తించిన లియాన్ స్పిన్ మంత్రానికి 8 మంది భారత ఆటగాళ్లు పేవీలియన్ కు చేరుకున్నారు. భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో తన మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.