అమెరికాలో మరో భారతీయుడు కాల్చివేత

అమెరికాలో మరో భారతీయుడిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరోసారి భారతీయుల భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. సౌత్ కరోలినాలో వ్యాపారం చేస్తున్న హర్నీష్ పటేల్ అనే భారతీయుడు తన దుకాణం నుండి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇంటికి అత్యంత సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పటేల్ ను కాల్చి చంపారు. సౌత్ కరోలినాలో లాంకాస్టర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పటేల్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఇది జాతి వివక్షవల్ల జరిగిన హత్యగా ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే చెప్తామని పోలీసులు అంటున్నారు. తనకు కాల్పుల శబ్దాలు వినిపించాయని ఒక మహిళ పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులకు పటేల్ మృతదేహం కనిపించింది. పటేల్ చాలా మంచి వాడని తన దుకాణంకు వచ్చే వారితో చాలా బాగా మాట్లాడేవారని స్థానికులు తెలిపారు. పటేల్ కు భార్య, కుమారై ఉన్నారు.
కేన్సాస్ లో ఇద్దరు తెలుగు వారిపై కాల్పులు జరిపిన ఘటనలో హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందగా మరో వ్యక్తి అలోక్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. దీనిపై అమెరికాతో పాటుగా భారత్ అంతటా నిరసన వ్యక్తం అయింది. జాతి వివక్షతో జరిగిన ఈ హత్యపై అమెరికన్ కాంగ్రెస్ తో పాటుగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ముగ్గురు భారతీయులు అమెరిన్ల కాల్పుల్లో మృతి చెందిన ఘటనల నేపధ్యంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *