పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం

కరెంటు బిల్లులు కట్టమని అడిగితే పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం అందుకుననాడని, అతని పి.ఎ తనపై దాడి చేశాడని విద్యుత్ లైన్ మెన్ ఒకరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి న వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఇంటికి దాదాపు 50వేల రూపాయల కరెంటు బిల్లు బకాయిలు ఉన్నాయి. దీనితో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ని బిల్లు కట్టమని అడిగిన లైన్ మెన్ కు ఎమ్మెల్యే పి.ఎ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే పి.ఎ., బంధువు అశోక్ రెడ్డి తిరిగి లైన్ మెన్ ను ఇంటికి పిలిపించుకుని ఎమ్మెల్యే ముందే దాడిచేశారని లైన్ మెన్ ఆరోపిస్తున్నాడు. దీనితో ఎమ్మెల్యే ఇంటి కరెంటు లైన్ కట్ చేస్తామని లైన్ మెన్ అనడంతో వివాదం ముదిరింది.
లైన్ మెన్ కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి బూతు పురాణం అందుకున్నాడు. ఎమ్మెల్యే ఇంటి కరెంటు తీస్తారా అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. తాము కరెంటు కట్ చేయలేదని చెప్పినా ఎమ్మెల్యే తన తిట్ల పురాణాన్ని ఆపలేదు. నువ్వెంత నీ బతుకెంత అంటూ విరుచుకుపడ్డార. తాను ఎమ్మెల్యేనని కరెంటు మంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని కూడా అవుతా నువ్వెంత అంటూ తీవ్ర పదజాలంతో తిట్టారు. ఎమ్మెల్యే రాయలేని బాషలో బూతుల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే బూతులు మొత్తం రికార్డు కావడంతో ఈ వ్యవహారం వివాదాస్పందం అయింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *