పారిపోండి లేదా చచ్చిపోండి…

ప్రపంచంలోని అత్యంత క్రూరమైన తీవ్రవాద సంస్థలో ఒకటైన ఇస్లామిక్ స్టేట్ ఓటమిని అంగీకరించింది. ఐఎస్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకుంది. ఇరాక్ లో పూర్తిగా ఓడిపోయినట్టు ఈ సంస్థ ప్రకటించుకుంది. ఇరాక్ లోని అత్యంత కీలకమైన మోసుల్ నగరాన్ని పూర్తిగా ఇరాక్ సైనికులు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడ తాము పూర్తిగా ఓడిపోయామని సంస్థ అధినేత, తనను తాను ఖలీఫా గా ప్రకటించుకున్న అబుబకర్ అల్ బాగ్దాదీ ఒప్పుకున్నాడు. ఈ మేరకు బాగ్దాదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇరాక్ లో ఐఎస్ తరపున పోరాడుతున్న అరబ్ జాతీయేతరులు ఇరాక్ ను విడిచి వెళ్లిపోవాలని లేదా తమను తాము పేల్చుకుని చనిపోవాలని కూడా బాగ్దాది తన సందేశంలో చెప్పాడు. ఇరాక్ లో ఐఎస్ స్థావరాలన్నింటినీ అక్కడి సైన్యం తన గుప్పిట్లోకి తీసుకోవడంతో ఐఎస్ నేతలు చాలా మంది ఇప్పటికే సిరియాకు పారిపోయారు. మిగిలిన కొద్ది మంది కూడా ఇప్పుడు ఇరాక్ ను విడిచి వెళ్లి పోయేందుకు సిద్ధం అవుతున్నారు.  మరో వైపు ఐఎస్ కు తరపున పోరాడుతున్న వారు పారిపోవాలని లేదా చనిపోవాలంటూ పిలుపునివ్వడం సంచలనం రేపుతోంది. వీడ్కోలు ప్రసంగం పేరుతో విడుదల అయిన ఈ సందేశంలో ఐఎస్ తీవ్రవాదులు తమ తమ స్వదేశాలకు వెళ్లిపోవాలి లేదా చనిపోవాలంటూ సందేశమిచ్చాడు. అయితే ఎక్కడి నుండి అబుబకర్ అల్ బాగ్దాదీ ఈ సందేశాన్నివిడుదల చేశాడు అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *